సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసిన శోభిత! 20 d ago
హీరో నాగ చైతన్య, నటి శోభితకు వివాహం జరగనున్న విషయం తెలిసిందే. తాజాగా సోమవారం ఉదయం శోభితను పెళ్లికూతురిగా ముస్తాబు చేసారు. దీనికి సంబంధించిన ఫోటోలు శోభిత తన సోషల్ మీడియా లో పంచుకున్నారు. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహం ఎదుట 8.13 PM కు వీరి పెళ్లి జరగనుంది. పెళ్లికూతురిగా సాంప్రదాయ చీరకట్టు లో ఉన్న శోభిత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.